దేవునిపడకల్ గంగపుత్ర సంఘానికి నూతన పాలకవర్గం ఎన్నిక.. సభ్యులకు శుభాకాంక్షలు

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామంలోని గంగపుత్ర సంఘానికి నూతన పాలకవర్గం ఎన్నికైంది. సోమవారం (03-08-2026) ఎన్నికల అధికారి రోజా మేడం చేతుల మీదుగా నూతన పాలకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ ఆర్డర్ కాపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలం, మాజీ అధ్యక్షుడు అంబటి రమేష్, మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి ఈ సందర్భంగా అభినందనలు, హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అధ్యక్షుడిగా అంబటి వెంకటేష్ జంగయ్య, సెక్రటరీగా కాడమోని నర్సింహా కృష్ణయ్య, ఉపాధ్యక్షుడిగా గుంటి లింగం రాములు, కోశాధికారిగా అంబటి బిక్షపతి, ఎస్. యాదయ్యలను ఎన్నుకున్నారు. డైరెక్టర్లుగా అంబటి రమేష్, అంబటి శ్రీను, అంబటి వెంకటేష్, కాడమోని సత్తయ్య, అంబటి పద్మమ్మ బాధ్యతలు చేపట్టారు.

నూతన పాలకవర్గం సమర్థవంతమైన నాయకత్వంతో గంగపుత్ర సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. సంఘం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ కొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నూతన పాలకవర్గం పదవీకాలం విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.