ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ హర్షం.. ‘ఇది విద్యార్థుల విజయం’

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) హర్షం వ్యక్తం చేసింది. “ఇది విద్యార్థుల విజయం” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించింది. రాజీనామా వార్త వెలువడగానే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టిన విద్యార్థులు, యువత సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, శాంతియుత ఆందోళనల ద్వారా కూడా లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. ఈ విషయాన్ని తాను మహాత్మా గాంధీ సిద్ధాంతాల నుంచి నేర్చుకున్నానని పేర్కొన్నారు.

దేశ యువత చేపట్టిన శాంతియుత నిరసనలు వృథా కాలేదని, విద్యార్థుల పోరాటం ఫలించిందని అభిజీత్ దీప్కే అన్నారు. ఈ విజయం విద్యార్థులందరిదేనని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.