యశ్వంతపూర్ బైపాస్‌లో సీపీ శ్వేతా రెడ్డి పర్యటన.. ప్రమాదాల నివారణపై ఆదేశాలు

జనగామలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీ శ్వేతా రెడ్డి వెస్ట్ జోన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా యశ్వంతపూర్ బైపాస్ వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సీపీ శ్వేతా రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రయాణికుల రక్షణే ప్రధాన ధ్యేయంగా, యశ్వంతపూర్ బైపాస్ ప్రాంతాన్ని ప్రమాద రహిత మార్గంగా తీర్చిదిద్దాలని సీపీ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గేలా అవసరమైన అన్ని భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు.