మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో **‘జగన్ 2.0 సూపర్ యాప్’**ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారిని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ నాయకత్వాన్ని నేరుగా కార్యకర్తలతో అనుసంధానించేందుకు, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు.
ప్రతి కార్యకర్త ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని నాయకులు కోరారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, వేధింపులు, కేసుల వివరాలను ఈ యాప్ ద్వారా నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.