బాణాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి తృతీయ పుష్కర వేడుకలు ఘనంగా ప్రారంభం

జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో తృతీయ పుష్కర మహోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

సాయంత్రం 4:30 గంటలకు జనగామకు చేరుకున్న శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి భక్తులు ఘన స్వాగతం పలికారు. జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కడకంచి బాలమణి, శ్రీ కడకంచి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డప్పు చప్పుళ్లు, డోలు విన్యాసాలు, మహిళల కోలాట నృత్యాల నడుమ చౌరస్తా నుంచి దేవాలయం వరకు శోభాయాత్రను నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.