ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం.. ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: సీఎస్ సంజయ్ జాజు

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ నివారణ చర్యలు, వ్యవసాయ ప్రణాళికలు, తాగునీటి నిర్వహణ తదితర అంశాలపై సీఎస్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కూడా పాల్గొన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలు, తాగునీటి సరఫరా, వ్యవసాయ ప్రణాళికలపై అధికారులతో కలిసి సమీక్షించారు.