కొండగట్టు హనుమాన్ జయంతి గోడ పత్రిక ఆవిష్కరణ.

తేది: 01-05-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో జరగనున్న హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఈఓ ఎస్ అంజనారెడ్డితో కలసిశుక్రవారం ఆవిష్కరించారు.ఈ నెల 10 నుంచి 12 వరకు భాగంగా యజ్ఞశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక హోమాలు నిర్వహించబడతాయి. అలాగే ఉత్సవ మూర్తికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక అభిషేకం, ఊంజళ్ సేవ ఘనంగా జరుగుతాయి. దీక్షామండపంలో హనుమాన్ దీక్షాస్వాములకు విరమణ కార్యక్రమం నిర్వహించబడునని, అదేవిధంగా భక్తుల కోసం సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఈవో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *