విలాసాగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు.

తేది:01-05-2026, రాజన్న సిరిసిల్ల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ దొబ్బల ప్రసాద్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: విలాసాగర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య హాజరై కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు,కార్మికుల శ్రమ సమాజాభివృద్ధికి ఎంతో కీలకమని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఆయన పేర్కొన్నారు,ఈ సందర్భంగా సుతారి కార్మికుల సేవలను కొనియాడుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గజ్జెల బాబు,సంఘం సభ్యులు,గ్రామ పెద్దలు,పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *