ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి-డిఆర్డీవో రఘువరణ్.

తేది: 30-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా : గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జగిత్యాల డిఆర్డీవో రఘువరణ్ అన్నారు. గురువారం రాయికల్ మండలంలోని రాజనగర్ గ్రామంలో ఖండిత కంధకాల పనులు, గ్రామ వన నర్సరీ, గ్రామైఖ్య సంఘం భవన నిర్మాణాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని సిబ్బందికి సూచించారు.పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం కూలీలు పనులు చేసి ప్రభుత్వం ఇస్తున్న వేతనం పొందాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 6 గంటల వరకు పనుల్లోకి రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బింగి చిరంజీవి,సర్పంచ్ భారతపు రాజేష్,ఏపీవో దివ్య, టెక్నికల్ అసిస్టెంట్లు విజయ్,రాజేందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటాచలం,ఫీల్డ్ అసిస్టెంట్ రాజేందర్, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *