కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం.

తేది: 30-04-2026, TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల విశేషాలతో నీతి అయోగ్ ‘దివ్యభారత్’ పేరుతో విడుదల చేసిన పుస్తకంలో అంజన్నక్షేత్రానికి చోటు లభించింది. దేశంలోని పలు రాష్ట్రాల పర్యాటక ప్రాంతాల గురించి, దేశవిదేశాల్లోని పర్యాటకులకు అవగాహన కల్పించేలా ఈ పుస్తకం రూపొందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కేవలం కొండగట్టు అంజన్నకే దివ్యభారత్‌లో చోటు దక్కడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *