కొండగట్టు అంజన్నను దర్శించుకున్న దేవాదాయ కమిషన్.

తేది:29-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హన్మంతరావు తేది:28-04-2026 నాడు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు ధార్మిక సలహాదారు గోవిందహరి కూడా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన కమిషనర్‌కు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మహా మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి కమిషనర్‌కు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *