కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఐఎఫ్‌ఎస్.

తేది: 27-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ అంజనేయస్వామి ఆలయాన్ని సోమవారం పోరిక లవ కుమార్, ఐఎఫ్‌ఎస్ (2024 బ్యాచ్ – జార్ఖండ్ క్యాడర్) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. వరంగల్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలోని పలామ జిల్లాలో అటవీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సుపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *