తేది:24-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో జిఎంఆర్ వరలక్ష్మి, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్తంగా నిరుద్యోగ యువతకు గత పది సంవత్సరాలుగా అసిస్టెంట్ ఎలక్ట్రిషన్,హోమ్ ఎయిడ్ హెల్త్, టైలరింగ్,టు వీలర్ బైక్ మెకానిక్ కోర్సుల్లో సుమారు 2100 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణ అందించగా,1500 మంది ఈ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు పొందారని ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.మహేష్ తెలిపారు.
యువతను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ…శిక్షణ పూర్తి చేసుకున్న యువతులు ఇంటి దగ్గర వైద్య సేవలు అందించడం వారి వృత్తి నిబద్ధతకు నిదర్శనమని,ఉన్న భూములమ్మి చదివి ఉద్యోగం లేక ఊర్లల్లో తిరిగే పరిస్థితులు ఉన్నాయని,ఈరోజుల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని,దేశంలో అత్యధికంగా పంజాబ్ లో డ్రగ్స్ కి యువత అలవాటు పడ్డారని,పాకిస్తాన్ డ్రోన్ ల ద్వారా మన దేశానికి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తుందని,దేశ యువతను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందని,అలాంటి అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకోవడానికి రాష్ట్రం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిఘా వ్యవస్థను (ఈగల్)ను ఏర్పాటు చేశారని,యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి,వసుదైక కుటుంబాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
జగన్నాథ్ పూర్-బోర్నపల్లి మధ్యన బ్రిడ్జి నిర్మాణ నిధుల కేటాయింపులో తన వంతుగా కృషి చేయాలని విద్యాసాగర్ రావు ను ఎమ్మెల్యే కోరారు. శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతకు గతంలో నీటి కొరతను తీర్చేందుకు శిక్షణా కేంద్రం వద్ద బోర్ ను ఏర్పాటు చేశామని,
హాస్టల్ వసతికి తనవంతుగా 30 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు నిధుల నుండి ప్రహరీ కూడా నిర్మాణానికి 35 లక్షల నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉందని,ఇట్టి పనులను స్థానిక మున్సిపల్ చైర్మన్ త్వరితగతిన ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.అనంతరం ఆయా కోర్సుల్లో శిక్షణ పొందిన యువతీ, యువకులకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు,ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ
భారతదేశంలో యువత ఒక టెక్నీషియన్ గా జీవితాన్ని ప్రారంభించి, సైంటిస్ట్ గా ఎదిగే అవకాశం ఉందని,శ్రమ శక్తిని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే స్వయం
ఉపాధి కోర్సులను అందిస్తున్నారని,యువత శ్రమశక్తిని బయటకు తీసుకొని వస్తేనే భారతదేశం విశ్వ గురువుగా మారుతుందని,
చేతివృత్తులు,రైతుల శ్రమశక్తి ద్వారా భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక ధనిక దేశంగా ఉండేదని,దండయాత్రల వల్ల నష్టపోయామని,ఇప్పుడు మన శ్రమశక్తి వల్ల తిరిగి ధనిక దేశంగా మారుతున్నారు.గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగాలు రాక చెడు వ్యసనాలకు బానిసలుగా మారడం కన్నా, స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి పొందాలని,చేతివృత్తులతో,శ్రమ శక్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్పొరేట్ సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2 శాతం డబ్బులు చట్టపరంగా సేవా కార్యక్రమాలకు ఇవ్వాల్సి ఉంటుందని,వ్యక్తిగత బాధ్యతగా ఆయా సంస్థలు ప్రతి మండలంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.యుద్దాల వల్ల18 సంవత్సరాలు చెల్ల చెదురుగా ఉన్న ఒక చిన్న దేశం వారి రాజ్యాంగంలో భారతదేశ సౌబ్రాంతుత్వం వల్ల మన దేశానికి ఒక పేజీని కేటాయించి గౌరవించిందని అన్నారు.పేషంట్ కేర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శిక్షణ పొందిన వారికి ధ్రువీకరణ పత్రాల కంటే అసిస్టెంట్ డాక్టర్ గా బిరుదు ఇవ్వాలని అన్నారు.
అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర ప్రచారక్ లింగం శ్రీధర్ జి..మాట్లాడుతూ జీఎంఆర్ వరలక్ష్మి, ప్రతిమ ఫౌండేషన్,జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వంటి సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం గొప్ప సేవ అని కొనియాడారు.పది సంవత్సరాలుగా మండల స్థాయిలోనే ఈ కార్యక్రమాలు కొనసాగడం ప్రశంసనీయం అన్నారు.స్వామి వివేకానంద ఆలోచనలను ఉదహరిస్తూ,తనకోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం జీవించే వారే నిజంగా జీవిస్తున్నారని చెప్పారు.శిక్షణ పొందుతున్న యువత తమ పనిని కేవలం ఉద్యోగంగా కాకుండా సేవగా భావించి,పూర్తి నిబద్ధతతో చేయాలని సూచించారు.ఏ పని చేసినా 100 శాతం శ్రద్ధతో చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని,సమాజానికి ఉపయోగపడే విధంగా తమ నైపుణ్యాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే ఈ శిక్షణ అవకాశాలను మరింత మందికి తెలియజేసి, సమాజంలో సేవా భావం పెంపొందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇన్చార్జి ఏ.ఎం రాజురెడ్డి, ప్రతిమ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ గీతారెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్,ఆర్గనైజర్లు రఘుపతి,విజయ,శ్రీకాంత్,శ్యామల,దొరసాని, జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్, చిరంజీవి,కృష్ణవేణి,వనిత పాల్గొన్నారు.