దుబాయ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి.

తేది:24-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెప్పాల నాగయ్య (తండ్రి రాజ గంగారం) తేది :23-04-2026 నాడు దుబాయ్‌లో గుండెపోటుతో మృతిచెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ విషయం కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్ బాస శ్రావణ్‌కు తెలియజేయగా, ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-కన్వీనర్ కట్ట మనోజ్ యాదవ్‌కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కట్ట మనోజ్ యాదవ్, తెలంగాణ గల్ఫ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి కలిసి సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన అధికారులు, హైదరాబాద్ విమానాశ్రయం నుండి మృతుని స్వగ్రామం తిమ్మాపూర్ వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. అత్యవసర సమయంలో స్పందించిన అధికారుల చర్యలు బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *