తేది: 23-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ బలుమురి వెంకట్ నర్సింగరావు నేడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వేదోక్త స్వస్తి స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉపప్రధాన అర్చకులు చిరంజీవి వేదోక్త ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి, ఎమ్మెల్సీకి శాలువా కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ తూము శ్రీనివాస్‌తో పాటు స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి పాల్గొన్నారు.