ఇశ్రతాబాద్ గ్రామంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు.

తేది:14-04-2026, సంగారెడ్డి జిల్లా TSLAWNEWS
ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలంలోని ఇశ్రతాబాద్ గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ జెండా ఎగురవేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సర్పంచ్ అనిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ కట్టేగోసే శ్రీనివాస్ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ సంఘాల అధ్యక్షులు, గ్రామ ప్రజలు మరియు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇశ్రతాబాద్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు మరువలేనివి. భారత దేశ పౌరులకు స్వేచ్ఛ ను కల్పించి వారు ఆచరించవలసిన విధులను కూడా రాజ్యాంగం లో పొందుపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికో చెందిన వ్యక్తి కాదని సమ సమాజ స్థాపన కోసం కృషి చేసి రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు.కుల మత,పేద ధనిక భేదాలు లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కి ఓటు హక్కు కల్పించి తమ పాలకులను తామే ఎన్నుకునే అవకాశాన్ని కల్పించారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *