సికింద్రాబాద్, ఓయూ పీజీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ని శాలువాలతో ఘనంగా సన్మానించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి సాంకేతికంగా ప్రకృతి వృక్ష మొక్కను కానుకగా బహుకరించారు. ప్రజా పరిపాలన విధానం పట్ల , చట్టాల పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల, అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజా సమస్యలను పరిష్కరించే వ్యక్తి అయినా బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ అని కొనియాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క పరిస్థితులు, స్థితిగతులు గురించి అవగాహన కలిగిన వారే ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు సంపూర్ణ న్యాయం చేస్తారని అలాంటి నాయకత్వ లక్షణాలున్న బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారిని అధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని మెదక్ పార్లమెంట్ ప్రజాక్షేత్రానికి అందరికీ పేరుపేరునా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేశారు.ఈ యొక్క సమావేశంలో మోహన్ గారు, కిరణ్ గారు, రాజేష్ గారు, నరేష్ గారు, సాయి కిరణ్ గారు మరియు అంబేద్కర్ విశ్వవిద్యాలయం పీజీ ప్రజా పాలన శాస్త్రము విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.