వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మాత్సవాలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గురువారం రోజున సాయంత్రం ఊరు  సమీపంలో గల  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం  నిర్వహించారు అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలతో  సుందరంగా అలకరించి వేద పండితులు మణి శంకర్ శర్మ నేతృత్వంలో కల్యాణం జరిపించారు పండితులు మాట్లాడుతూ 19 వ తేదీన శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ ఏండ్లు బండ్లు ఊరేగింపు ,శనివారం రోజున గ్రామంలో ఉదయం లక్ష్మీ నరసింహస్వామి వారిని రథంపై  ఊరేగిస్తారు అని తెలిపారు ఈకార్యక్రమంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మీ, లక్ష్మీన్,ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్,కరోబార్ మాధవ్ రావు,రామ్మోహన్ రావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు బోయిని అంజయ్య,కాటుకం తిరుపతి,పుల్లెల సాయి కృష్ణ,బోయిని మల్లయ్య,దాసరి అంజయ్య,రాపోలు రవి,దేశరాజు కనకయ్య, భక్తులు,మహిళలు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *