న్యూఢిల్లీ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) చర్యల పట్ల యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజనీర్ ప్రవేశ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ పేపర్లను తెలుగు మీడియం చదువుకున్న వారు ఇంగ్లీష్‌లో పరీక్ష ఎలా రాస్తారని బుధవారం నాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రశ్నించారు. తెలుగులో పరీక్ష రాసేందుకు విద్యార్ధులకు అవ కాశం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కొందరు విద్యార్ధులు అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్తే పరీక్ష తెలుగులో రాసేలా వెసులుబాటు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ట్రిబ్యు నల్ తీర్పును అమలుపరచకుండా ఎపిపిఎస్సీ చైర్మన్ కోర్టుకు వెళ్తామనడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో తెలుగు బాష కోసం చేసింది శూన్యమని, తెలుగు భాష కోసం ఇచ్చిన హామీలేవీ అమలుపరచలేదని విమర్శిం చారు. ఏపి హైకోర్టు, అమరావతిలో అన్ని శిలా పలకాలు ఇంగ్లీష్ లోనే వేశారని తెలిపారు.