బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్-డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని పలువురు సెలబ్రిటీలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనను ఇండియాలో సినిమాలు తీయనీయకపోతే హాలీవుడ్‌కు వెళ్లిపోతానని అన్నారు. తనకు భాషతో సంబంధం లేదని, ఏ భాషలోనైనా సరే సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు.