ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలు టీడీపీ అరాచకానికి పరాకాష్ట అని నామినేషన్ల పర్వంతో ప్రారంభమైన అరాచకం డిక్లరేషన్ ఫారాల వరకు కొనసాగిందని వైసీపీ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీ హంతకులు, గూండాలపై బైండోవర్ కేసులు ఎందుకు పెట్టలేదు? ఎస్ఈసీని పక్షవాతం వచ్చిన రోగిలా మార్చారని వ్యవస్థలను నాశనం చేసి చంద్రబాబు ఏం చేయదలచుకున్నారని నాని ఫైర్ అయ్యారు.
దుశ్సాసన మూక ఆకాశమే హద్దుగా చెలరేగాయి. చంద్రబాబు సృష్టించింది.. ప్రజాస్వామ్య విధ్వంసం పులివెందులలో టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేసిన వీడియోలు బయటకు వచ్చాయని అన్నారు. అలా గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా? మేము అడిగే పోలింగ్ కేంద్రాల్లోని సీసీ కెమెరా పుటేజీ ఇచ్చే దమ్ముందా? 2021లో నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బ తిన్నది. మంగళగిరి, తాడికొండలో కూడా టీడీపీ ఓడిపోయింది. మరి అమరావతికి వ్యతిరేకంగా జనం ఓటేశారని చంద్రబాబు ఒప్పుకుంటారా అని అన్నారు.
గ్రామ కంఠం పేరుతో రాజధాని రైతుల మీద ఎందుకు కక్ష కట్టారు? రైతుల ఆస్తులు, పొలాలను నిర్దయగా కబ్జా చేస్తున్నారని, చంద్రబాబు, మంత్రి నారాయణ ఇళ్లు తప్ప ఇంకెవరైనా అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారా? 29 గ్రామాల ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి ఉందా? జగన్ చేసిన పనులు తప్ప చంద్రబాబు శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? తుపానులను ఆపేస్తాననే చంద్రబాబు ఆర్ణబ్ వలన జనం ఎందుకు చనిపోయారు? మురసు తుపాను వలన నష్టఫోయిన వారికి నయాపైసా సాయమైనా చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. కరువుతో విలవిలలాడుతున్న రాయలసీమ, పల్నాడు ప్రాంత రైతులకు ఏం న్యాయం చేశారు? పీ4 వలన బాగుపడిన ఒక్క కుటుంబమైనా ఉందా అని అన్నారు.
అమరావతిలోని కాంట్రాక్టర్లంతా మార్గదర్శకులు చంద్రబాబు, లోకేష్ కుటుంబాలు బంగారు కుటుంబాలని, ఇంతకన్నా పీ4 ఇంకేమైనా ఉందా అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు యాభై ఏళ్ల అనుభవమంతా తప్పుడుదనమేనని, చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో వారి వివరాలు ఇవ్వాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. దేశంలో చంద్రబాబు అంత వరెస్ట్ పాలిటిక్స్ నడిపేవారు ఇంకెవరూ లేరని, ప్రతిపక్షాలను పోటీకి రానీయకుండా అడ్డుకోవటం గుడ్ పాలిటిక్సా? బీసీలకు 34% టికెట్లు ఇస్తానని మోసం చేయటం సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. దళితుల్లో ఎంతమందికి పదవులు ఇచ్చారు? రాష్ట్రంలో కమ్మవారు ఎక్కువా? దళితులు ఎక్కువా? చంద్రబాబు సొల్లు కబుర్లు ఆపి, ఏ కులానికి న్యాయం చేశారో చెప్పాలని, చంద్రబాబు ప్రెస్మీట్ ఆత్మవంచన అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.