కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రైస్ మిల్లర్లు బంద్ పాటిస్తూ నిరసనకు దిగారు. రైస్ మిల్లులపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను వెంటనే నిలిపివేయాలని, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల మాజీ గౌరవ అధ్యక్షుడు నాగులగామ వెంకన్నసెట్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పెరిగిన రవాణా ఖర్చులకు అనుగుణంగా ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే మిల్లర్లను చర్చలకు పిలిచి పరిష్కారం చూపాలని వారు కోరారు. సీఎం చర్చకు పిలిచి సమస్యలను పరిష్కరించే వరకు రైస్ మిల్లుల బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో బాన్సువాడలో రైస్ మిల్లర్లు బంద్ పాటిస్తూ నిరసన చేపట్టారు.