ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు రహస్యంగా ఓ కుమారుడు ఉన్నాడా? ఉంటే అతడే భవిష్యత్ వారసుడిగా ఎదగనున్నాడా? లేక కిమ్ కుటుంబ రాజకీయ వారసత్వం తొలిసారి ఓ మహిళ చేతుల్లోకి వెళ్లనుందా? అనే చర్చ మరోసారి అంతర్జాతీయంగా మొదలైంది.
అయితే దక్షిణ కొరియా నిఘా సంస్థ మాత్రం కిమ్‌కు పెద్ద కుమారుడు ఉన్నాడా లేదా అన్నది ఇప్పటికీ పూర్తిగా నిర్ధారణ కాలేదని తెలిపింది. కిమ్ కుటుంబానికి సంబంధించిన వారసత్వంపై అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ, కుమారుడి ఉనికిపై స్పష్టమైన సమాచారం లేదని పేర్కొంది.
ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ టీనేజ్ కుమార్తె కిమ్ జూ ఏనే అత్యంత సంభావ్య వారసురాలిగా కనిపిస్తోందని దక్షిణ కొరియా నిఘా సంస్థ అంచనా వేసింది. దీంతో ఉత్తర కొరియాకు భవిష్యత్ నాయకత్వం ఓ మహిళ చేతుల్లోకి వెళ్లే అవకాశంపై చర్చ కొనసాగుతోంది. అయితే తుది వారసత్వంపై ఇప్పుడే స్పష్టమైన నిర్ణయానికి రావడం సాధ్యం కాదని నిపుణులు భావిస్తున్నారు.