జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్‌డీవోలు, ఎమ్మార్వోలు పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, పెండింగ్ అంశాలపై అధికారులతో మంత్రులు సమీక్షించినట్లు తెలిపారు.
రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.