సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్’పై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ ఏకంగా విలన్ పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు మొదట ప్రచారంలోకి రావడంతో ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ పోతినేని విలన్ పాత్రలో కనిపించడం లేదని తెలుస్తోంది. సినిమాలో రజినీకాంత్ మామగా, సిమ్రన్ అత్తగా నటించనున్నట్లు సమాచారం. వారి కుమార్తెగా రాశీ ఖన్నా కనిపించనుండగా.. ఆమెకు జోడీగా రామ్ పోతినేని అల్లుడి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మామ రజినీకాంత్, అల్లుడు రామ్ పోతినేని మధ్య సినిమా మొత్తం ఈగో క్లాష్ నడుస్తుందని తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కథలో కీలకంగా ఉండేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రజినీకాంత్, రామ్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.