బద్వేల్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విస్తృతంగా మొక్కలు నాటిన మున్సిపాలిటీ

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న “Partners in Nation Building – Ane Nenu” కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటారు.

కార్యక్రమ మార్గదర్శకాల్లో భాగంగా ఆగస్టు 14న పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి ఎదుగుదలకు అవసరమైన సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అధికారులు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.