ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన కార్యక్రమంలో తన మాట తీరు, సామాజిక అంశాలపై చేసిన వ్యాఖ్యలతో రోజువారీ కూలీ మహమ్మద్ ఇర్ఫాన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఆయన విశ్లేషణకు నెటిజన్లు ప్రశంసలు కురిపించగా, దేశ రాజకీయ వర్గాల దృష్టి కూడా ఆయనపై పడింది.
ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా మహమ్మద్ ఇర్ఫాన్ నివాసానికి వెళ్లి ఆయనను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ భేటీ అనంతరం ఇర్ఫాన్ పేరు మరింతగా వార్తల్లో నిలిచింది. సాధారణ కూలీగా జీవనం సాగిస్తున్న వ్యక్తిని జాతీయ స్థాయి నాయకులు కలవడం విశేషంగా మారింది.
అయితే రాహుల్ గాంధీ భేటీకి ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తనకు ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని ఇర్ఫాన్ తాజాగా వెల్లడించారు. ఆ సంభాషణలో చోటుచేసుకున్న సరదా సంఘటనలను ఆయన పంచుకోవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.