బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమా ప్రకటించిన నారా రోహిత్.. ‘సౌండ్ ఇంజనీర్’ టైటిల్ ఖరారు

టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నారా రోహిత్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు. తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఫన్-ఫిల్డ్ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘సౌండ్ ఇంజనీర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

చినిమిల్లి మణికుమార్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు నరేష్ విజయకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.