పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యే సమాజ నిర్మాణానికి బలమైన పునాది అని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ సమాన బాధ్యత కలిగిన భాగస్వాములని అమరనాథ్ రెడ్డి అన్నారు. ఈ ఇద్దరూ సమన్వయంతో పనిచేస్తేనే పిల్లలు విద్య, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.