కరీంనగర్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ.. కార్యక్రమాన్ని పరిశీలించిన మేయర్ శ్రీనివాస్

కరీంనగర్ నగరంలోని రెండో డివిజన్ తీగల గుట్టపల్లెలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని మేయర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు.

అలాగే అనర్హుల పేర్ల తొలగింపు, కొత్త పేర్ల చేర్పు, అవసరమైన మార్పులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు.