పసిపాప ఏడుపు ఆపలేకపోయిందో కసాయి తల్లి దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టింది. చిన్నారి ఏడుపు వినలేక ఆగ్రహానికి గురైన ఆమె.. ఏకంగా కొడవలితో గొంతు కోసి హతమార్చింది. కన్నపేగు అనే కనికరం లేకుండా క్షణికావేశంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా తీవ్ర విషాదాన్ని, సంచలనాన్ని సృష్టించింది.
ఏడుపు ఆపకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన తల్లి.. ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకుని చిన్నారి గొంతు కోసింది. ఈ దారుణ ఘటనతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పసిపాప ప్రాణాలు తీసిన ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.