ఘోర రోడ్డు ప్రమాదం. విలాసాగర్ కు చెందిన వ్యక్తి మృతి.

తేది:29-04-2026, రాజన్న సిరిసిల్ల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ దొబ్బల ప్రసాద్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: లారీ ఢీకొని బైక్‌దారుడి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఏప్రిల్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శివారులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు విలాసాగర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ప్రమాదంతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *