తేది:24-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో (FPO) ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. దళారులకు అమ్మి నష్టపోవద్దని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సరైన ధరతో పాటు పారదర్శకత ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌పీఓ చైర్మన్ కుంభాల రాజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, సర్పంచ్ పుప్పాల లక్ష్మి మహేష్, మాజీ సర్పంచులు పుప్పాల నర్సయ్య లింగంపల్లి.గంగాధర్.ఉపసర్పంచ్ రాపల్లి మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూస రాజేశ్వర్,మరియు పుప్పాల గజేందర్ వార్డు సభ్యుడు బైండ్ల విశాల్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.