తేది:24-04-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశ విధానాల ఫలితంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసిన చరిత్ర ఆర్టీసీ కార్మికుల ది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వ రంగముగా గుర్తిస్తాము, విలీనం చేస్తామని ,ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా సమానవేతనాలు చెల్లిస్తామని ,కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని, బకాయిల చెల్లింపు ,పెండింగ్ జీతాలు, ఇతర బెనిఫిట్స్ ఇస్తామని ,పనిగంటల పరిస్థితులు డ్యూటీ గంటలు తగ్గించి మెరుగైన పరిస్థితులను కల్పిస్తామని, ఆరోగ్య సదుపాయాలు, మెడికల్ ఇన్సూరెన్స్ మెరుగుపరుస్తామని ,పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లిస్తామని హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ కనీసమైన కార్యాచరణ ముందుకు పోకపోవడం వలన పదేపదే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేదు. గత్యంతరము లేని పరిస్థితులలో సమ్మె నోటీసు ఇచ్చి 40 రోజులు దాటిన ప్రభుత్వానికి స్పందన లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి దానిగా CPUSI (DBSV) పార్టీ ఖండిస్తున్నది. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చేసిన చర్చలు విఫలం కావడం అనేది ప్రభుత్వ బాధ్యతారహిత విధానానికి నిదర్శనమని భావిస్తున్నాం రవాణా సేవలను అందించే ముఖ్యమైన సంస్థ అయిన ఆర్టీసీ, వేలాది కార్మికుల కష్టంతో నడుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కాని పరిస్థితిలో ఉన్నాయి. వారి ఆవేదనను ప్రభుత్వం గమనించి వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. సమ్మె అనేది వారి చివరి మార్గం మాత్రమే అని మేముభావిస్తున్నాము.
ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే ఆర్టీసీ కార్మికులకు మా ఐక్యతను తెలియజేస్తూ, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అంగీకరించాలని కోరుతున్నాము. లేనిపక్షంలో నిర్బంధాల ద్వారా బెదిరింపుల ద్వారా ఎ స్మాచట్టాన్ని ప్రయోగించడం ద్వారా అణచివేయాలని చూస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరిస్తున్నాము.
అదే సమయంలో, ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని, ప్రజలకు ఇబ్బందులు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని CPUSI ( DBSV )వరంగల్ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తు,ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టి ( CPUSI )దళిత బహుజన శ్రామిక విముక్తి ( DBSV ) వరంగల్ జిల్లా కార్యదర్శి గడ్డం శరత్.