తేది:17-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా బుగ్గారం మండలం యశ్వంత్రావుపేట్ గ్రామాన్ని సందర్శించి నిర్మాణం లో ఉన్న అభివృద్ధి పనులను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.
గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణ స్థితిని పరిశీలించి తగు సూచనలు అందించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
అనంతరం బుగ్గారం మండల కేంద్రంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం,
సమయపాలన పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, మహిళా సంఘ భవన నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించారు.
కాంట్రాక్టర్లు పనులను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.అధికారులు నిర్మాణం లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాణ్యత ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అని అన్నారు.
ప్రజా అవసరాలకు అనుగుణంగా నిర్మాణం లో ఉన్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, DRDO రఘువరన్, PD హౌసింగ్ ప్రసాద్, పంచాయతీ రాజ్ DE గోపాల్, MRO భూమేశ్వర్, MPDO వాసవి, స్థానిక సర్పంచ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.