డబ్బా గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన ఉపసర్పంచ్.

తేది:14-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పనిచేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఉపసర్పంచ్ రాపల్లి మహేష్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మహేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉపాధి కూలీలు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం ఉపాధి హామీ మేటి మహేష్ , వన సేవకులు వేణు లను వార్డు సభ్యులు కనుక నాగరాజ్, బైండ్ల విశాల్, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్, కనుక జగ్గన్న, గొర్రె రాజేష్, ఆకు రమేష్, నరేష్, అనిల్, రంజిత్‌తో పాటు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *