తేది:13-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా :కొండగట్టు ఆంజనేయస్వామి చిన్న జయంతోత్సవాలు ఈ నెల 2న అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం దీక్షా స్వాములు సమర్పించిన ముడుపులను విప్పగా రూ. 1,69,069 వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీ లలితా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కింపులో ఆలయ ఈవో అంజన రెడ్డి, ఏఈఓ హరిహరనాథ్, పర్యవేక్షకులు సునీల్ కుమార్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, కపిందర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.