జగిత్యాల జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకునే ఫీజుల బోర్డులను ఏర్పాటు చేయాలి – అడిషనల్ కలెక్టర్ బి రాజాగౌడ్.

తేది: 09-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: ప్రైవేట్ ఆస్పత్రిలో పేదలకు తక్కువ ఫీజులు తీసుకోవాలి – ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి రాజాగౌడ్ – లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం -జగిత్యాల జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకునే ఫీజుల బోర్డులను ఏర్పాటు చేయాలి – అడిషనల్ కలెక్టర్ బి రాజాగౌడ్
జగిత్యాల జిల్లా ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ అథారిటీ , క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ -2010 మరియు పి సీ పీ ఎన్ డి టీ యాక్ట్ 1994 యొక్క జిల్లా స్థాయి బహుళ సభ్యుల అధికారుల సమావేశం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి రాజాగౌడ్ ఛాంబర్ లో జరిగింది. జగిత్యాల జిల్లాలోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని, రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ మాత్రమే సేవలు అందించాలని, ఎవరైనా వెళ్ళిపోయిన కానీ కొత్తగా చేరినచో, డాక్టర్లను గాని స్టాఫ్ ను గాని ఆడ్ చేయించుకోవాలని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి రాజాగౌడ్ తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి సుజాత మాట్లాడుతూ పెర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం 13 అప్లికేషన్స్ వచ్చాయని ఆ సెంటర్లను తనిఖీ చేసి అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకొన్నమని వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ, శస్త్ర చికిత్సల ప్రసవాలతో పాటు, రక్త పరీక్షలు, X ray, స్కానింగ్,ఇతర వైద్య సేవలకు తీసుకునే ఫీజుల వివరాలతో ఆయా వైద్యశాలలలో బోర్డులను ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి రాజాగౌడ్ ఆదేశించారు. నిరుపేద ప్రజలు వైద్యం కోసం తమ ఆసుపత్రులకు వచ్చినప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో వారికి తక్కువ డబ్బులతో చికిత్స అందజేయాలని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ కోరారు. ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్టేజీ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని,వైద్యశాలల పరిసరాలు పరిశుభ్రతతో ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం, ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ ఆలిఖాన్ , ఇంచార్జి కటుకం భూమేశ్వర్,హెల్త్ ఎడ్యుకేటర్ తరాల శంకర్, హెచ్ ఈ ఓ ఎనుగంటి రాజేశం, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *