తేది:07-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా: జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. కార్యాలయ ప్రధాన గేటుకు తాళాలు వేసిన ఏసీబీ అధికారులు, పలు విభాగాల్లో ఫైళ్ల ను తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.