కొల్లూరు ఎక్స్ రోడ్డులో చలివేంద్రం ప్రారంభం.

తేది:06-04-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ​ఝరాసంగం మండల కొల్లూరు గ్రామ ఎక్స్ రోడ్డు వద్ద వేసవి కాలాన్ని పురస్కరించుకుని ప్రజల మరియు పక్షుల దాహార్తిని తీర్చేందుకు జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.
​ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం కొల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ అధ్యక్షతన, తన తండ్రి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్, మరియు రుద్రప్ప పాటిల్ హాజరై, రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
​ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దైవ సేవకులు పౌల్  ప్రజా ప్రతినిధులుఎక్స్ ఎంపీటీసీ సి.హెచ్. రాజ్ కుమార్, సర్పంచ్లు గోపాల్, ప్రభాకర్, మధుకర్, నర్సింలు.రాజకీయ నాయకులు: గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్.ముఖ్య నాయకులు: రామేశ్వరం ఆలయ చైర్మన్ రాజేందర్, సంగ్రామ్ పాటిల్, మారుతీ పాటిల్, వేణుగోపాల్ రెడ్డి, సిద్ధు పాటిల్.
డాక్టర్ జాన్ శ్రీకాంత్, సి.హెచ్. మొగులయ్య, ఎం. మొగులయ్య, రాములు, రామరెడ్డి, నాగనాథ్, బాబు, సి. ప్రకాశ్‌, సిఆర్పి చిరంజీవి, రాజు, ఎం. విష్ణు, సంగారెడ్డి, వినయ్ చిన్న, కిష్టయ్య, ఆరిఫ్, మల్లన్న పాటిల్, సంగన్న, దేవదాస్ తదితరులు.ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బాటసారుల సౌకర్యార్థం జనని ఫౌండేషన్ చేసిన ఈ కృషిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నాయకులు మరియు కొల్లూరు గ్రామ పెద్దలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *