ST పేద రైతుల భూమి కాజేస్తున్న బడా పెత్తందారులు. దరఖాస్తు చేసిన రైతులను పట్టించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్.

తేది:06-04-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సంగారెడ్డి పట్టణం టౌన్ రిపోర్టర్ బంగ్ల సాయికుమార్.

రాష్ట్ర ఉన్నత అధికారాల ప్రోత్సాహం తో ST రైతుల పై నిర్లక్ష వైఖరి.

సంగారెడ్డి జిల్లా: ఝరసంఘం మండలం వనంపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 57 లో గల 24 ఎకరాలు 26 గుంటల పట్టా భూమి, ST సామాజిక వర్గానికి చెందిన లంబాడి వంశస్థుల భూమి తాత ముత్తాతల నుండి సాగు చేస్తూ జొన్న, కుసుమ, కంది మొదలైన పంటలు పండించి కొంటున్నారు.
ఈ పట్టా భూమి దాదాపు 56 మంది చిన్న రైతుల పేరు మీద ఉంది, ఈ భూమి పై కన్నేసిన బడా పెత్తందారు వెంకటేశ్వర్ రావు, ఈ భూమి పక్కన తనకు ఉన్న వంద పైచిలుకు భూమి కి అనుకోని ఉన్న ఈ చిన్న ST రైతుల భూమి పై కన్ను పడి తమిళనాడు మాజీ గవర్నర్ పీస్ రామ్ మోహన్ రావు మా మేన మామ అని, డీజీపీ వాళ్ల చుట్టం అని, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బంధువు అని చెప్పి ఈ చిన్న రైతుల భూమి కబ్జా చెయ్యడానికి చూస్తున్నారు అని రైతుల ఆవేదన చెందుతున్నారు.
రైతులు బాధ చెప్పడానికి అని కలెక్టర్ ఆఫీస్ కి వస్తె, నిర్లక్ష్యంతో వ్యవహరించిన కలెక్టర్.
గిరిజన రైతులు తమ బాధను చెప్పడానికి ఏమి చెయ్యాలో అర్ధం కాక మీడియా నీ ఆశ్రయించడం జరిగింది.
లంబాడి రైతులు మాట్లాడుతూ మాకు న్యాయం చేసి మా తాతలు నుండి సంక్రమించిన భూమిని కాపాడాలి అని కోరినారు.
రాష్ట్ర లంబాడి హక్కుల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ మా లంబాడీల పట్టా భూమిని ఎవరైనా కాజయ్యడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు అని అవసరం అయితే రాష్ట్ర స్థాయిలో ST లను ఏకం చేసి ఉద్యమిస్తామని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బోజ్యనాయక్ తండా రైతులు బోజ్యనాయక్, మాజీ గ్రామ సర్పంచ్ కిషన్ నాయక్, గణేష్, దేవుల, రమేష్, శంకర్ నాయక్ , జీవులు, శక్రియ మొదలగు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *