తేది:05-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని శ్రీ మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన కార్యవర్గమునకు స్థానిక పద్మశాలి సేవా సంఘం భవనంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వేముల సతీష్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషిచేస్తానని ప్రతి సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు వేముల సతీష్, ప్రధానకార్యదర్శి మోర శివకుమార్, ఉపాధ్యక్షులు అనుమల్ల మల్లేశం, సిరిపురపు ఆనందం, కోశాధికారి పొట్టవత్తిని నాగభూషణం, సంయుక్త కార్యదర్శులు బొమ్మకంటి సురేష్, రఘు ప్రచారకార్యదర్శి మిట్టపల్లి జగన్, ముఖ్య సలహాదారులు బొమ్మకంటి ధర్మపురి, మోర గణేష్, వెంకటేశ్వర్లు, బాలె చంద్రశేఖర్, మిట్టపల్లి దామోదర్, కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి రాకేష్, బొమ్మకంటి రవికుమార్, అనుమల్ల సతీష్, గుట్ట శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షులు పోతు సత్యనారాయణ, మాజీ ప్రధానకార్యదర్శి మిట్టపల్లి రాజేందర్, సంఘ సభ్యులు పోతు శ్రీనివాస్, శ్రీకాంత్, అంగరి నరేష్, చిలువేరి రమేష్, మహేష్ ,వంగరి నరేష్ ,బొమ్మ కంటి ఉమేష్, అనుమల్ల కాంతయ్య, పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.