తేది: 05-04-2026 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ దుర్గ భవాని.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం పరిధిలోని ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడం ఎంతో సేవాభావంతో కూడుకున్న కార్యక్రమమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని, సమాజంలో సేవా భావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్, ట్రస్ట్ అధ్యక్షులు డేగల సతీష్ బాబు, రంజిత్, కుంపట్ల శ్రీనివాస్, సురేంద్రనాథ్ రెడ్డి, నరసింహ రెడ్డి, డేవిడ్ రాజు, రమేష్, నారాయణ, సత్యనారాయణ, వికాస్, గఫ్ఫార్, రహీం, అసిఫ్, రెహానా షైక్ తదితరులు పాల్గొన్నారు.