తేది:05-03- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాబాట’ కార్యక్రమంలో భాగంగా, ఝరాసంగం మండలంలోని మెదపల్లి గ్రామంలో విద్యుత్ అధికారుల బృందం పర్యటించింది. గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ సరళ , సబ్ ఇంజనీర్ హస్నూద్దీన్ , లైన్ ఇన్‌స్పెక్టర్ షాదుల్లా మరియు ఏఎల్ఎం శేఖర్ మెదపల్లి గ్రామానికి విచ్చేసి, గ్రామంలోని విద్యుత్ సరఫరా మరియు ఇతర సాంకేతిక సమస్యలను పరిశీలించారు.
మెదపల్లి గ్రామ సర్పంచ్ కొల్లూర్ అరుణ నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు, గ్రామ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు అధికారులను కలిసి గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ముఖ్యంగా గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయడం.
లో-ఓల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం.
శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను మార్చడం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు కొల్లూర్ అభిలాష్ రెడ్డి, ఉప సర్పంచ్ మజర్ అహ్మద్, మరియు వార్డు సభ్యురాలు స్వప్న దిలీప్ పాల్గొని, సమస్యల తీవ్రతను అధికారులకు క్షుణ్ణంగా వివరించారు.
గ్రామ నాయకులు వివరించిన సమస్యలపై ఏఈ సరళ గారు సానుకూలంగా స్పందించారు. ప్రజలకు నిరంతరాయంగా మరియు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ ప్రాధాన్యతని, గ్రామంలో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అధికారుల తక్షణ స్పందన పట్ల గ్రామ నాయకులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.