తేది:05-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: ధర్నా అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అశోక్ రెడ్డి గారికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు రాహుల్ గాంధీ గారికి రాసిన బహిరంగ లేఖను ఇవ్వడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి. లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది. అధిష్టానాన్ని ఒప్పించి మాదిగలకు రాజ్యసభ వచ్చేలా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదే. MSP మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ.తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి ప్రస్తుతం భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ మాదిగలకు ఒక స్థానం ఇవ్వాలని , గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా మాదిగలకు చేసిన అన్యాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుండి మాదిగలకు పార్లమెంట్ లో రాజకీయ ప్రాతినిధ్య లేకుండా కుట్రలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుండి పార్లమెంట్ లో ఒసిలకు, బీసీలకు, ఎస్టీలకు అలాగే ఎస్సీలలో మాలలకు ప్రాతినిధ్యం ఉందని అన్నారు .కానీ ప్రాతినిధ్యం లేని కులం మాదిగలు మాత్రమే అని అన్నారు. ఇప్పటికే రాజ్యసభలో ప్రాతినిధ్యం కలిగి ఉన్న రెడ్డి,బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే బదులు అసలే రాజకీయ ప్రాతినిధ్యం లేని మాదిగలకు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. గతంలో YS రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో మాదిగలకు ఏకకాలంలో రాజ్యసభలోను, లోక్ సభ లోను ప్రాతినిధ్యం ఉందని అన్నారు. లోక్ సభలో మంద జగన్నాథం , సిరిసిల్ల రాజయ్య మరియు రాజ్యసభలో నంది ఎల్లయ్య మాదిగ సామాజిక వర్గం నుండి అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏకకాలంలో టీడీపీలో తెలంగాణ నుండి ఇద్దరు మాదిగలు లోక్ సభ లో ఉన్నారు.అందులో ఒకరు మంద జగన్నాథం మరొకరు సుగుణ కుమారి.అదే సమయంలో టీడీపీ నుండి మరొకరు రాజ్యసభలో మాదిగ సామాజిక వర్గం నుండి ఆకారపు సుదర్శన్ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి కాలంలో మాదిగలు లోక్ సభలో, రాజ్యసభలోను ఒక్కరు కూడా లేకుండా పోయారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు నాయుడులతో పోల్చుకుంటే మాదిగలకు సరైన ప్రాతినిధ్యం, గుర్తింపు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి చాలా వెనుకబడి ఉన్నాడని స్పష్టం చేశారు. మాదిగ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నాడని అనుకోవాలని మాదిగలకు గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం మాదిగ జాతిపై సవతి ప్రేమను చూపుతున్నాడని అన్నారు. మొన్న 5 శాసనమండలి స్థానాలు భర్తీ అయితే అందులో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వలేదు అని అన్నారు.కనుక ఇప్పుడు చిత్తశుద్దిని
నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం భర్తీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మాదిగలకు కేటాయించే విధంగా అధిష్టానాన్ని ఒప్పించి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే ఉందని అన్నారు.రాజ్యసభలో రెడ్డిలకు ప్రాతినిధ్యం ఉన్న తర్వాత కూడా మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చూడడం రెడ్ల పాలన నియంతృత్వనికి పరాకాష్టగా మారుతుందని అన్నారు. రాజ్యసభ స్థానాల్లో మాదిగలకు న్యాయం జరిగే వరకు మంద కృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు అవసరమనుకుంటే MRPS ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళనలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో MSP జాతీయ నాయకులు వేల్పుల సూరన్న , MRPS జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ ,MSP జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ ,MSP రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ ,MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ ,MSP రాష్ట్ర నాయకులు మంద రాజు మాదిగ,MSP జిల్లా అధికార ప్రతినిధి గంగరపు శ్రీనివాస్ మాదిగ ,MSP సీనియర్ నాయకులు అకెణకుంట వెంకట స్వామి మాదిగ , రాజరాపు బిక్షపతి మాదిగ , MRPS సోషల్ మీడియా ఇన్చార్జి మంద వర్ధన్ మాదిగ ,MRPS MSP మండల జిల్లా నాయకులురేణుకుంట్ల మహేష్ మాదిగ ,రజనీకుమార్ మాదిగ ,అడ్డురీ అనిల్ మాదిగ ,నద్దునూరి రఘు మాదిగ , గణేశ్ మాదిగ ,అర్షం సుధాకర్ మాదిగ ,తదితరులు పాల్గొన్నారు.