డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించిన ఎన్నికల ప్రత్యేక అధికారి మరియు జిల్లా పరిషత్ సిఈవో గౌతమ్ రెడ్డి.

తేది: 09-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం రాయికల్ కేంద్రంలో పర్యటించిన ఎన్నికల ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై అధికారులకు సూచనలు పలు చేశారు.
పోలింగ్ రోజున వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ కార్యాలయంలో పీవో మెటీరియల్ నిల్వలను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి లభ్యతపై సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరగాలని సూచించారు.
ఎటువంటి లోపాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అన్నారు.
పోలింగ్ రోజున శాంతియుత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఎం.పి.డి.వో చిరంజీవి, ఏఈ లక్ష్మి, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *