1వ వార్డు అభ్యర్థి బెజ్జం పాపరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

తేది:08-2-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: వర్ధన్నపేట మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ బెజ్జం పాపరావు గెలుపు లక్ష్యంగా గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు విస్తృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే నాగరాజు సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆయనను శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు.
అనంతరం 1వ వార్డు పరిధిలోని ప్రతి వీధి, ప్రతి గడపను సందర్శిస్తూ ఎమ్మెల్యే నాగరాజు ఓటర్లతో నేరుగా మమేకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమాన్నే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తుందని తెలిపారు.అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. అలాగే 1వ వార్డు పరిధిలో త్రాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని విజయవంతం చేశారు. చివరగా కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేతి గుర్తుకు ఓటు వేసి 1వ వార్డు అభ్యర్థి శ్రీ బెజ్జం పాపరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు, ఇంచార్జీలు, స్థానిక నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *