తేది: 07- 02- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆదరవేని మల్లయ్య s /o చిన్న కొమురయ్య , 50 సం., యాదవ, కు, అందాదా 25 సం. క్రితం ఉప్పరిపేట కి చెందిన సత్తవ్వ తో పెద్దల సమక్షం లో వివాహం జరిగినది. వాళ్ళకు ఒక కొడుకు, ఒక కూతురు సంతానం గా కలరు. కాగా కొంతకాలంగా ఆదరవేని మల్లయ్యకు, తన బార్య సత్తవ్వ కి మధ్య అతిగా మద్యం సేవిస్తున్నాడాని, ఏమి పని చేయడం లేదని, త్రాగి వచ్చి కొడుతున్నాడాని గొడవలు జరుగుతున్నాయి. గతం లో కొన్ని రోజులు సత్తవ్వ తన తల్లి గారింటికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి వచ్చినది. గోడవల విషయమై పెద్దల సమక్షం లో పలుమార్లు పంచాయితీలు జరిగినాయి. ఆదరవేని మల్లయ్య గతం లో మీద పోలీస్ కేసు కూడా అయినది. బార్యను కొడుతున్నానని నా పిల్లలు కూడా మల్లయ్య తో మాట్లాడడం లేదు. మల్లయ్య ప్రవర్తన నచ్చక తన భార్య గత 3 సం. ల నుండి దగ్గరికి రానివ్వడం లేదు. దాంతో బార్య సత్తవ్వ మీద కోపం పెరిగింది. ఆతనిని తన బార్య వొంటరీని
చేసిందని, దాన్ని చంపితేనే మనశాంతి అనే పగతో, బార్య సత్తవ్వని చంపాలనే సమయం కోసం చూస్తుండగా నాలుగు రోజుల క్రితం తన కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ కి పోయింది,కొడుకు హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇంట్లో తాను, తన బార్య ఇద్దరు మాత్రమే ఉండడం తో ఇదే సరయిన సమయం అని ఎలాగైనా రాత్రి తన బార్యను చంపాలని నిర్ణయించకున్నాడు . మద్య రాత్రి అందాదా 2.00 గంటల ప్రాంతం లో తన బార్య గాఢ నిద్రలో ఉన్న సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న గొడ్డలి ని తీసుకొని తన నుదుటి మీద నరికాడు దాంతో సత్తవ్వ స్పృహ కోల్పోయింది. తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే చాక్ తో గొంతు కోసాడు , అంతటి తో ఆగకుండా కోపంతో అదే గొడ్డలి తో పైశాచికంగా నరికి బార్య సత్తవ్వ చనిపోయిందని నిర్దారించుకొని అక్కడి నుండి పారిపోయాడు. తర్వాత లక్ష్మీపూర్ గ్రామ శివారులో పోలీస్ వారు అరెస్ట్ చేసి కోర్టు యందు ప్రవేశపెటినారని జగిత్యాల రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.