ఓట్ల లెక్కింపుకు కసరత్తు పూర్తి! మున్సిపల్ ఎన్నికలు–2026లో పారదర్శక కౌంటింగ్‌కు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ.

తేది:7-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా : ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు విస్తృత స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అక్షరాలా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రౌండ్‌లో ఓట్ల లెక్కింపు స్పష్టంగా, క్రమబద్ధంగా జరగాలని, ఫలితాల నమోదు సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
లెక్కింపు కేంద్రాల్లో క్రమశిక్షణ, భద్రత, పారదర్శకతే ప్రధాన లక్ష్యమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ గారు, ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ శిక్షణతో అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమై, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఫలితాల ప్రకటన జరగనుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *