తేది:07-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ అండదండలతో ఎనిమిదవ వార్డు ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
8వ వార్డు సమస్యలను పరిష్కరించేందుకు జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేస్తా- 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చింటూ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఎనిమిదో వార్డులో ఉన్న ప్రజా సమస్యలను ప్రచారంలో భాగంగా తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంత దూరమైనా వెళ్తా, 8వ వార్డులో భూగర్భ జలాలను కాపాడుతా, అవినీతి పరులకు తగిన బుద్ధి చెబుతా, ఎనిమిదో వార్డులో ఎనిమిదవ వార్డు ప్రజల అండదండలతో వారి సమస్యలను పరిష్కరించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తా ఈ గెలుపు ఎనిమిదో వార్డు ప్రజలదే అని తెలియజేశారు. ప్రచారంలో భాగంగా ఎనిమిదవ వార్డు ఇంచార్జ్ చింటూ గౌడ్ మాట్లాడుతూ 8వ వార్డు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం పనిచేస్తుందని ఎనిమిదో వార్డు ప్రజల అభివృద్ధికి శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి అండదండలు ఉంటాయని తెలియజేశారు. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 8వ వార్డు ప్రజలే దేవుళ్ళు అని కొనియాడుతూ వారికి సేవ చేయడానికి వాళ్ళ కష్టాలు తీర్చడానికి సంపూర్ణ కృషితో చట్టాన్ని అనుసరించి, శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి అండదండలతో ఎనిమిదో వార్డు అభివృద్ధిని సాధిస్తామని తెలియజేశారు. 8వ వార్డు ప్రజల ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఎనిమిదవ వార్డు ప్రజలు సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారిని అఖండ విజయంతో గెలిపిస్తామని సంతోషంతో వ్యక్తం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీశైలం, నవాజ్, వసీం, షరీఫ్, రజాక్, మరియు కాంగ్రెస్ పార్టీ మహిళామూర్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.